![]() |
![]() |
.webp)
ప్రతీ ఒక్కరికి సొంతంగా ఓ ఇల్లు ఉండాలని కోరుకుంటారు. అందులోనూ ఈ జనరేషన్ వాళ్ళకి మరీను. కొంతమంది బుల్లితెర టీవీ యాంకర్స్, నటీనటులు ఇప్పటికే సొంతింటి కలని నెరవేర్చుకోగా.. ఇప్పుడు అరియానా వంతు అయింది.
అరియాన గ్లోరీ.. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న బ్యూటీ. బిగ్ బాస్ తో మంచి క్రేజ్ సంపాదించుకొని సెలబ్రిటీ అయిపోయింది. అరియాన.. మొదటగా తన కెరీర్ ని కుకింగ్ షోస్ తో మొదలు పెట్టింది. ఆ తర్వాత కామెడీ షోలకి యాంకర్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సెలబ్రిటీలని ఇంటర్వ్యూ చెయ్యడం అవి కాంట్రవర్సిటికీ దారితీయడంతో ఫేమస్ అయింది అరియాన. ఫైనల్లీ డ్రీమ్ ఈజ్ కమింగ్ ట్రూ అనే ట్యాగ్ లైన్ తో అరియానా గ్లోరీ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
అరియానాకి ఇన్ స్టాగ్రామ్ లో వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. దాంతో తనేం పోస్ట్ చేసిన లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. అరియాన సిస్టర్ నయని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. బిగ్ బాస్ స్టేజ్ మీద అరియాన గురించి నయని మాట్లాడిన మాటలతో బాగానే ఫేమస్ అయింది. ఇక అక్కాచెల్లెళ్లిద్దరూ ఇప్పుడు తమ సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారు. డ్రీమ్ హౌజ్ రెడీ కాబోతోందని చెప్పేశారు. తమ కొత్త ఇంటి పనులకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసి ఈ గుడ్ న్యూస్‌ను అభిమానులతో పంచుకున్నారు. అయితే అరియాన వేసిన ఈ పోస్ట్ మీద బుల్లితెర సెలెబ్రిటీలు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు స్పందిస్తూ కంగ్రాట్స్ చెబుతున్నారు. బిగ్ బాస్ లాస్య, బిగ్ బాస్ దేవీ నాగవల్లి, బుల్లితెర నటి అన్షు, నటి రాజేశ్వరి ప్రసాద్ ఇలా చాలా మంది అరియాన పోస్ట్ మీద స్పందిస్తూ కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇక త్వరలోనే గృహప్రవేశ వేడుకల్ని కూడా నిర్వహించేలా ఉన్నారు.
![]() |
![]() |